2026 ఆసియా క్రీడల పురుషుల క్రికెట్ టోర్నీ ఫైనల్‌కు పాకిస్థాన్ చేరుకుంది. నిషిన్‌లోని కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో జరిగిన తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం, తడి మైదానం కారణంగా మ్యాచ్‌ను 13 ఓవర్లకు కుదించారు.
టాస్ గెలిచిన పాకిస్థాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 13 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. తౌహిద్ హృదోయ్ 25 బంతుల్లో 42 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతని స్కోరులో రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. పాకిస్థాన్ బౌలర్లలో సుఫియాన్ ముకీమ్ మూడు వికెట్లు, అరాఫత్ మిన్హాస్ రెండు వికెట్లు పడగొట్టారు.
లక్ష్య ఛేదనలో పాకిస్థాన్‌కు ఆరంభం ఆశించిన స్థాయిలో సాగలేదు. ఒక దశలో 53 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అయితే హసన్ నవాజ్, అబ్దుల్ సమద్ కలిసి కీలక భాగస్వామ్యంతో జట్టును విజయతీరాలకు చేర్చారు.
హసన్ నవాజ్ 27 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, అబ్దుల్ సమద్ కేవలం 15 బంతుల్లోనే 30 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరూ కలిసి 59 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు.
పాకిస్థాన్ 11.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. దీంతో ఆసియా క్రీడల పురుషుల క్రికెట్లో స్వర్ణ పతకం కోసం జరిగే పోరుకు అర్హత సాధించింది.
ఇక రెండో సెమీఫైనల్లో భారత్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఆ మ్యాచ్‌లో విజేత పాకిస్థాన్‌తో ఫైనల్లో స్వర్ణ పతకం కోసం పోటీ పడనుంది.










