మంచేరియల్, 2026-06-27
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశాల మేరకు, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీని ఆయన పరిశీలించారు. జూలై 24 వరకు ఇంటింటి కార్యక్రమాన్ని పారదర్శకంగా చేపట్టాలని తెలిపారు.
జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల 37, 51, 40 డివిజన్లలో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియను మండల తహసిల్దార్ రఫతుల్లా, అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటర్లకు అందిస్తున్న ఎన్యుమరేషన్ ఫారాల ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని తెలిపారు. జూలై 24వ తేదీ వరకు నిర్వహించే సమగ్ర సవరణ ఇంటింటి కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ఈ క్రమంలో బూత్ స్థాయి అధికారులు ఓటర్ల వద్దకు వెళ్లినప్పుడు ఎన్యుమరేషన్ ఫారం అందించిన వెంటనే బిఎల్ఓ యాప్లో మార్క్ చేయాలని సూచించారు.
సదరు ఓటరు ఎన్యుమరేషన్ ఫారం నింపిన తరువాత తిరిగి సేకరించి యాప్లో వివరాలు నమోదు చేయాలని తెలిపారు. మరణించిన వారు, గ్రామం వదిలి వెళ్ళిన వారు, రెండు అంతకంటే ఎక్కువ ఎపిక్ కార్డులు కలిగి ఉన్న అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఒకరికి ఒక ఓటరు గుర్తింపు కార్డు మాత్రమే ఉండేలా స్పష్టమైన జాబితా రూపొందించాలని ఆదేశించారు.
ఎన్యుమరేషన్ ఫారాలు నింపిన తరువాత తిరిగి సేకరించి బిఎల్ఓ యాప్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా వివరాలు స్పష్టంగా నమోదు చేయాలని, ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని, ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, బూత్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.












