హైదరాబాద్, 2026-06-05
టిఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు, చైర్మన్ శ్రీ మారం జగదీశ్వర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లోని నాంపల్లి టీఎన్జీవో భవన్లో, మంచిర్యాలలో ఘనంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు.
టిఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు, చైర్మన్ శ్రీ మారం జగదీశ్వర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లోని నాంపల్లి టీఎన్జీవో భవన్లో, మంచిర్యాలలో ఘనంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు.
జిల్లా అధ్యక్షుల శుభాకాంక్షలు
మంచిర్యాల జిల్లాలో జరిగిన ఈ వేడుకలకు టిఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ, టిఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్ అన్నగారికి మంచిర్యాల జిల్లా తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అన్నగారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరిన్ని జరుపుకొని ఆరోగ్యంగా ఉండాలని, టీఎన్జీవో కేంద్ర సంఘానికి ఆయన అందిస్తున్న సేవలు కొనసాగాలని, ఉద్యోగుల సమస్యలపై పోరాడేందుకు ఆయురారోగ్యాలను భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు.
పాల్గొన్న నాయకులు
ఈ జన్మదిన వేడుకలలో టిఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి శ్రీ బొడ్డు శ్రావణ్ కుమార్, కేంద్ర సంఘం కార్యదర్శి శ్రీ పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీ శ్రీపతి బాపురావు, కోశాధికారీ శ్రీ సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, తిరుపతి, రాంకుమార్, సత్యనారాయణ, నరేందర్, కేజియా రాణి, సంయుక్త కార్యదర్శులు సునీత, ప్రభు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మోసిన్, మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, కార్యదర్శి అజయ్, ఉపాధ్యక్షులు ప్రకాష్, మందమర్రి యూనిట్ అధ్యక్షులు సుమన్, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.











