మంచేరియల్, 2026-07-18
మంచిర్యాల జిల్లాలో TELANGANA RTC HIRE BUSES DRIVERS & CLEANERS WELFARE ASSOCIATION నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా శ్రీ తూముల నరేష్, అధ్యక్షునిగా శ్రీ రమేష్ కుమార్, జనరల్ సెక్రటరీగా శ్రీ ఎం.డి. నజీర్, లీగల్ అడ్వైజర్లుగా శ్రీ నాగిరెడ్డి మల్లారెడ్డి, శ్రీ సాయి ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులు సంఘ అభివృద్ధికి, సభ్యుల సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తామని పేర్కొన్నారు.
మంచిర్యాల జిల్లా TELANGANA RTC HIRE BUSES DRIVERS & CLEANERS WELFARE ASSOCIATION నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులుగా శ్రీ తూముల నరేష్, అధ్యక్షునిగా శ్రీ రమేష్ కుమార్, జనరల్ సెక్రటరీగా శ్రీ ఎం.డి. నజీర్, లీగల్ అడ్వైజర్లుగా శ్రీ నాగిరెడ్డి మల్లారెడ్డి మరియు శ్రీ సాయి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నూతన కార్యవర్గ ఎన్నికల అనంతరం సంఘ సభ్యులందరూ గౌరవ అధ్యక్షులు శ్రీ తూముల నరేష్ గారిని ఘనంగా సన్మానించారు. అనంతరం శ్రీ తూముల నరేష్ గారు నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ RTC హైర్ బస్సుల డ్రైవర్లు మరియు క్లీనర్ల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ, ఉద్యోగ భద్రత, వేతనాలు మరియు ఇతర సమస్యల పరిష్కారం కోసం సంఘం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. నూతన కమిటీ సభ్యులు సంఘ అభివృద్ధికి, సభ్యుల సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, సభ్యులు మరియు పలువురు డ్రైవర్లు, క్లీనర్లు పాల్గొని నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.











