పెద్దపల్లి, 2026-11-22
పెద్దపల్లి పట్టణంలో ప్రభుత్వ ఐటీఐ గ్రౌండ్ లో అభివృద్ధి పనులను పరిశీలించి, వాకింగ్ ట్రాక్, లైటింగ్ ఏర్పాటుపై అధికారులకు పలు సూచనలు చేశారు ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ చింతకుంట విజయరమణ రావు. ఈ సందర్భంగా ఐటీఐ కళాశాలలో నూతన వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు.
అనంతరం పట్టణంలోని జెండా చౌరస్తా వద్ద జరుగుతున్న ప్రధాన రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. జెండా చౌరస్తాలో ఏర్పాటు చేయనున్న 150 అడుగుల భారీ జాతీయ జెండా స్థలాన్ని పరిశీలించి, అభివృద్ధిలో భాగంగా తొలగించిన పాత కమాన్ ప్రాంతంలో త్వరలో నూతన హంగులతో కమాన్ నిర్మాణం చేస్తామని ప్రభుత్వ విప్ విజయరమణ రావు తెలిపారు. జెండా నుండి మసీదు చౌరస్తా వరకు రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
తదుపరి పెద్దపల్లి మండలం నిట్టూరు, నిమ్మనపల్లి గ్రామాల్లో సింగిల్ విండో, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక నాయకులతో కలిసి ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ చింతకుంట విజయరమణ రావు ప్రారంభించారు. రైతులందరూ ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా తమ ధాన్యాన్ని అమ్ముకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్, కమిషనర్, పట్టణ కౌన్సిలర్లు, సింగిల్ విండో చైర్మన్, డైరెక్టర్లు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.







