మంచేరియల్, జూలై 21, 2026
రాష్ట్రంలోని జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలోని జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయం నుంచి అదనపు కార్యదర్శి ఇలంబర్తి, శాంతి భద్రతల అధికారులు, రవాణా, రహదారి భవనాలు, జాతీయ రహదారుల శాఖల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు, రవాణా, రహదారులు భవనాల శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ, రాష్ట్రంలోని జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం జాతీయ రహదారులపై ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలని, జిల్లాస్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశాలు ప్రతినెల నిర్వహించాలని తెలిపారు. టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయాలని, జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగే ప్రాంతాలు, బ్లాక్ స్పాట్ లను గుర్తించి రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. అంబులెన్స్ లను అందుబాటులో ఉంచాలని, ప్రమాదాలు జరిగిన వెంటనే క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, రహదారి భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించాలని తెలిపారు. వాహనదారులు తప్పకుండా సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించేలా చర్యలు తీసుకోవాలని వికాస్ రాజ్ సూచించారు.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, జిల్లాలోని జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రహదారి భద్రత కమిటీ సమావేశాలు నిర్వహించి భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నామని, రహదారిపై ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్ ప్రాంతాలను గుర్తించి రక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డి.సి.పి. ఎ.భాస్కర్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.












