హైదరాబాద్, 2026-06-05
రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా పదవిలో ఉంటూనే, తన కుమార్తె కొండ సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేస్తున్న వ్యాఖ్యలను మంత్రి కొండ సురేఖ ఖండించకపోవడం విచారకరమని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు అన్నారు. హైదరాబాద్లోని అసెంబ్లీ సీఎల్పీ మీడియా పాయింట్ వద్ద సహచర ప్రభుత్వ విప్ లు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

ఆత్మ విమర్శ చేసుకోవాలి
తన కూతురు చేసిన వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని మంత్రి కొండ సురేఖ చెప్పడం సరికాదని ఆయన అన్నారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి చేసిన పోరాటం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల త్యాగాల ఫలితంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకమైన మంత్రి పదవిని పొంది, ఆ పదవిని అనుభవిస్తూనే మరోవైపు గౌరవ ముఖ్యమంత్రి గారిపై, ఆయన సోదరులపై కొండ సురేఖ కుటుంబం విమర్శలకు దిగడం పట్ల ఆమె ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పార్టీ విజయం
నిద్రాహారాలు మాని, సుశిక్షితులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన కష్టార్జితం, ఎన్నో అవమానాలు, నిర్బంధాలు, కఠినమైన జైలు జీవితాలను అనుభవించిన రేవంత్ రెడ్డి కృషి వల్లనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందనేది నగ్నసత్యమని ఆయన అన్నారు.
నాయకుల మనసులు గాయపడుతున్నాయి
ఎంతోమంది అర్హులు ఉన్నప్పటికీ, సీనియర్ నాయకురాలిగా, బీసీ మహిళగా గుర్తించి క్యాబినెట్ మంత్రిగా కొండ సురేఖకు అవకాశం కల్పిస్తే, ఆమె చేసే రాజకీయాలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మనసులను ఎంతగానో గాయపరుస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ విజయరమణ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
సాంప్రదాయాలను విస్మరిస్తున్నారు
కూతుళ్లు, కుమారులు చేసే పనులకు తల్లిదండ్రులు బాధ్యత వహించడం సహజమనే కనీస సాంప్రదాయాలను కొండ సురేఖ విస్మరిస్తున్నారని ఆయన అన్నారు. అలాంటిది ఏకంగా గౌరవ సీఎం పైనే తీవ్రమైన విమర్శలకు దిగిన, తన ఇంట్లోనే ఉంటున్న తన కూతురు వ్యాఖ్యలను మంత్రి కొండ సురేఖ ఎందుకు ఖండించడం లేదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు ప్రశ్నించారు.