ఢిల్లీ / చీరాల, 2026-08-07
ఢిల్లీలో నిర్వహించిన గోమాత ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ, మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం కామాఖ్య దేవాలయ నిర్వాహకులు భవానీ సతీష్ మాట్లాడుతూ, గోమాతను రాష్ట్ర మాతగా ప్రకటించేందుకు పోరాడే అవకాశం దక్కడం తమ పూర్వజన్మ సుకృతమని ఆనందం వ్యక్తం చేశారు.

ప్రతినిధుల హాజరుపై విచారం
ఈ మహాకార్యానికి తెలంగాణ నుంచి తక్కువ సంఖ్యలో ప్రతినిధులు హాజరుకావడం పట్ల ఆయన కొంత విచారం వ్యక్తం చేశారు. అయితే, గోమాత విశిష్టతను చాటేందుకు సొంత వాహనంలో ప్రతి ఊరు, ప్రతి గల్లీ తిరుగుతూ స్వయంగా సంతకాల సేకరణ చేపడతానని ఆయన స్పష్టం చేశారు.
ఆత్మవిశ్వాసంతో హామీ
ఢిల్లీలోని సమావేశంలో సాధు సంతులు, గోభక్తుల సమక్షంలో ఆయన ఈ ఆత్మవిశ్వాసంతో కూడిన హామీని ఇచ్చారు. సతీష్ ప్రసంగానికి స్పందించిన సభలోని ప్రతినిధులు, సాధు సంతులు పెద్ద ఎత్తున చప్పట్లతో ప్రాంగణాన్ని మార్మోగించారు.
గోవధ నిర్మూలన లక్ష్యం
మందమర్రి కామాఖ్య దేవాలయం దేశవ్యాప్తంగా సంపూర్ణ గోవధ నిర్మూలన చట్టాన్ని తీసుకురావడమే లక్ష్యంగా, న్యూఢిల్లీలో ఆగస్టు 5, 6 తేదీల్లో నిర్వహించిన జాతీయ స్థాయి గో-సమ్మాన్ ఆహ్వాన్ అభియాన్ సమావేశాలకు మంచిర్యాల జిల్లా మందమర్రి కామాఖ్య దేవాలయ ఆచార్యులు మంథని సతీష్ భవానీకి ప్రత్యేక ఆహ్వానం అందింది.
గతంలోనూ వినతి
గతంలో గో సంరక్షణకై 70 వేల మంది సంతకాల ప్రతులను కలెక్టర్ ద్వారా రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్, సీఎంలకు అందించిన ఆయన.. ఈ ఢిల్లీ సదస్సులో గో సంరక్షణపై తన సూచనలను పంచుకోనున్నారు. గోమాతను రాష్ట్ర మాతగా ప్రకటించాలనే సాధువుల పిలుపుమేరకు ఈ సమావేశాలలో పాల్గొనడం జరిగింది.