ఓదెల, 27-07-2026
భీమరిపల్లి గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా 10 లక్షల రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను గ్రామ సర్పంచ్ శ్రీ రంగు మల్లేష్ గౌడ్ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు శ్రీ మూల ప్రేమ్ సాగర్ రెడ్డితో పాటు గ్రామ ప్రజలు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
భీమరిపల్లి గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా 10 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను గ్రామ సర్పంచ్ శ్రీ రంగు మల్లేష్ గౌడ్ గారు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు శ్రీ మూల ప్రేమ్ సాగర్ రెడ్డి గారు, గ్రామ ప్రజలు, వార్డు నెంబర్లు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ప్రభుత్వ నిధులను సక్రమంగా వినియోగించి, నాణ్యమైన రోడ్డు పనులు చేపడతామని తెలిపారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు మరిన్ని నిధులు తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
మండల పార్టీ అధ్యక్షుడు ప్రేమ్ సాగర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.










