పట్టణంలో మత్తు పదార్థాల విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఆదేశాల మేరకు పట్టణంలోని టీ పాయింట్ల వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా యువతకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
జిల్లా డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఆదేశాల మేరకు పట్టణంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు.
పట్టణ ఏసీపీ ప్రకాష్ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు టీ పాయింట్ల వద్ద మత్తు పదార్థాలు విక్రయిస్తున్నారనే అనుమానంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రతి టీ పాయింట్ లోని స్మోకింగ్ జోన్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా సిగరెట్ తాగుతున్న యువతకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తుకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు.
టీ పాయింట్ల నిర్వాహకులకు కూడా కఠిన హెచ్చరికలు జారీ చేశారు. మత్తు పదార్థాలు విక్రయిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ తనిఖీల్లో పట్టణ ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
యువతను మత్తు పదార్థాల బారి నుండి కాపాడేందుకు ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఏసీపీ ప్రకాష్ తెలిపారు.








