మంచిర్యాల పట్టణంలోని గాయత్రి మాత కాలనీలో కోజాగర పూర్ణిమ వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ పౌర్ణమి రోజున చంద్ర కిరణాలు పాలలో పడితే అవి అమృత తుల్యంగా మారతాయని, వాటిని సేవించడం వల్ల ఆయురారోగ్యాలు, సంపదలు వృద్ధి చెందుతాయని నమ్మకం.
మన ఋషుల ప్రకారం, ఈ పౌర్ణమి రోజున చంద్రుని నుండి వచ్చే కిరణాలు పాలలో పడితే ఆ పాలు అమృత తుల్యంగా మారతాయని నమ్మకం. ఈ అమృత తుల్యమైన పాలను సేవించడం వల్ల ఆయురారోగ్యాలు, పిల్లల చదువులు, సంపదలు వృద్ధి చెందుతాయని ప్రతీతి.
ఈ నమ్మకంతో కాలనీవాసులందరూ లక్ష్మీదేవిని పూజించి, పౌర్ణమి చంద్రుడిని దర్శించుకుని, ఆ అమృత తుల్యమైన పాలను సేవించారు. లక్ష్మీదేవి ఆశీస్సులతో కాలనీవాసులందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో తాటికొండ మల్లేష్, జక్కుల రాజు, అబ్బోజు సుదర్శన్, డా. రామకృష్ణ, తోగిటి వెంకటేష్, దివాకర్, శ్రీనివాస్ తదితరులతో పాటు కాలనీవాసులు, మహిళలు, పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



