తెలంగాణ ఉద్యమకారుల సమితి (టీ.యూ.ఎస్.) రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా నరెడ్ల కల్పనను నియమించారు. ఈ నియామకం పట్ల ఆమె సమితి రాష్ట్ర అధ్యక్షుడు తొడేటి శంకర్ గౌడ్కు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో రాష్ట్రస్థాయి బాధ్యతలు అప్పగించడం ఆనందంగా ఉందని, ఈ బాధ్యతను అంకితభావంతో నిర్వహిస్తానని ఆమె పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కల్పన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యమకారుల త్యాగాలు మరువలేనివని అన్నారు. వారి ఆశయాల సాధనకు, హక్కుల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఉద్యమకారులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన గుర్తింపు, గౌరవం, సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఉద్యమకారులను సమన్వయం చేసుకుంటూ, వారు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ సమితి బలోపేతానికి, ఉద్యమకారుల సంక్షేమానికి నిరంతరం పాటుపడతానని నరెడ్ల కల్పన స్పష్టం చేశారు.