మత సామరస్యాన్ని కాపాడాలని, గాంధీజీ పోరాట స్ఫూర్తితో ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును పరిరక్షించుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పిలుపునిచ్చారు. గాంధీ జయంతి సందర్భంగా సీపీఐ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు.
మత సామరస్యాన్ని కాపాడాలి. గాంధీజీ పోరాట స్ఫూర్తితో ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును కాపాడుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా సీపీఐ జాతీయ సమితి పిలుపుమేరకు శుక్రవారం సీపీఐ ఆధ్వర్యంలో ఠాగూర్ స్టేడియం ముందున్న గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, సీపీఐ మండల కార్యదర్శి వనం సత్యనారాయణ హాజరై మాట్లాడుతూ... రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజల ఓటు హక్కును రక్షించుకోవాలని, దీని కోసం గాంధీజీ ఇచ్చిన అహింసా వాదంతో ముందుకు సాగాలని, గాంధీజీ ఇచ్చిన పిలుపు మేరకు తన సిద్ధాంతాలను అమలు చేస్తూ ప్రజల చేతుల ఓటు హక్కును కాపాడుకోవాలని, దీని కోసం అందరూ పోరాడాలన్నారు.
ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఓట్లను తొలగించడం సరైన పద్ధతి కాదని, ఓటు హక్కు చట్టబద్ధత అని, అందరికీ ఓటు హక్కు కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం మనదని, మతాలకు, ప్రాంతాలకు, కులాలకు అతీతంగా ప్రజాస్వామ్యబద్ధంగా జీవించే హక్కు ఉందని, మతాలను ఒకరిపై ఒకరు రుద్దే హక్కు ఎవరికీ లేదన్నారు. రాజ్యాంగానికి కట్టుబడి అందరూ పని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి వనం సత్యనారాయణ, సీపీఐ జిల్లా సమితి సభ్యులు నక్క వెంకటస్వామి, కాదండి సాంబయ్య, మామిడి గోపి, ఎగుడ మొండి, కౌన్సిలర్లు కౌడగాని సాంబయ్య, మీనుగు ముని, పార్టీ ప్రజాసంఘాల నాయకులు గుమాస మల్లేష్, కారుకూరి రాయలింగు, మాదాస్ శంకర్, యండి హుస్సేన్, రాంపల్లి రాజం, కోదాటి లక్ష్మణ్ రావు, కందుల రాజేశం తదితరులు పాల్గొన్నారు.











