మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 24, 25వ డివిజన్లలో (సింగపూర్, తాళ్లపల్లి కాలనీ) ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సింగరేణి జీఎం శ్రీనివాస్ తో కలిసి పర్యటించారు. ప్రజల నుంచి నేరుగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు డివిజన్ ప్రజలను నేరుగా కలిసి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తెలియజేసిన సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి, అన్నింటినీ త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని పరిష్కారం చూపడమే తన లక్ష్యమని చెప్పారు. ప్రజల అవసరాలను తీర్చడానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
ఈ పర్యటనలో మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. స్థానిక కార్పొరేటర్లు బోడ్డు స్వప్న-తిరుపతి, తోట రజిత-శ్రీనివాస్, ఇతర కార్పొరేటర్లు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.











