మంచేరియల్, 10 October
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్, తోలవాగుకు చెందిన మట్టపతి మోహన్ అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం గౌరవ కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 60,000 ఆర్థిక సహాయం మంజూరు చేయించారు.

ఈ ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును కాంగ్రెస్ పార్టీ నాయకులు మంథన జగన్ మోహన్ రావు చేతుల మీదుగా మట్టపతి మోహన్‌కు అందజేశారు.
ఈ సందర్భంగా మట్టపతి మోహన్ మాట్లాడుతూ, 60,000 రూపాయల ఆర్థిక సహాయం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇప్పించిన కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి, అలాగే తనకు ఈ చెక్కును అందజేసిన మంథన జగన్ మోహన్ రావుకు రుణపడి ఉంటానని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ మంచిర్యాల నియోజకవర్గ మాజీ అధ్యక్షులు, 11వ డివిజన్ నాయకులు సుదమల్ల అశోక్ తేజ, కాంగ్రెస్ పార్టీ నాయకులు వనపర్తి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.