మంచేరియల్, 24 October
నియోజకవర్గ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరనుంది. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రత్యేక చొరవతో పట్టణంలోని విశ్వనాథ ఆలయ పునఃనిర్మాణ పనులు రూ.10 కోట్లతో వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ పనులను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు.

ఈ నేపథ్యంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, ఐఏఎస్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, శ్రీనివాస్, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ విశ్వనాథ ఆలయంలో స్వామి వారిని దర్శించుకొని, ఆలయ పునఃనిర్మాణ పనులను పరిశీలించారు. మొదటి విడతలో రూ.5 కోట్లతో నూతన ఆలయ పునఃనిర్మాణం చేపట్టనున్నట్లు వారు వెల్లడించారు.
అనంతరం వారు కాలేజీ రోడ్డులోని గోదావరి పుష్కరాల ఘాట్ పనులను కూడా పరిశీలించారు.
2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని, విశ్వనాథ ఆలయంతో పాటు గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయాల పునర్నిర్మాణ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. పుష్కరాల సందర్భంగా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేపట్టనుందని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారి ప్రత్యేక చొరవతో విశ్వనాథ ఆలయం ఆధ్యాత్మిక వైభవానికి కొత్త చిరునామాగా రూపుదిద్దుకోనుంది.
ఈ కార్యక్రమంలో ముక్త రవి, సంబంధిత అధికారులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ గుండ సుధాకర్, ఆలయ కమిటీ సభ్యులు, కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.