మంచేరియల్, 2026-07-29
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని 12వ డివిజన్ కార్పొరేటర్ కస్తూరి నాగరాజు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా పిల్లలు, పెద్దలు విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగలు, నీరు నిల్వ ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు.
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో డివిజన్ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని 12వ డివిజన్ కార్పొరేటర్ కస్తూరి నాగరాజు మనవి చేశారు. పిల్లలు, పెద్దలు ఎవరూ విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగలు, నీరు నిల్వ ఉన్న ప్రాంతాల వద్దకు వెళ్లవద్దని సూచించారు.
ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే సంబంధిత అధికారులకు లేదా మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ సిబ్బంది, అధికారులు 24 గంటలు అందుబాటులో ఉంటారని తెలిపారు.
అందరూ జాగ్రత్తగా ఉండి, అవసరం లేని ప్రయాణాలను నివారించి, తమ కుటుంబ సభ్యుల భద్రతను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. డివిజన్ ప్రజల భద్రతే తమ ప్రాధాన్యత అని కార్పొరేటర్ కస్తూరి నాగరాజు స్పష్టం చేశారు.











