శ్రీ గాయత్రి మాత గణేష్ మండలి ఆధ్వర్యంలో గాయత్రి మాత కాలనీలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం కుంకుమ పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ పూజలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీ గాయత్రి మాత గణేష్ మండలి ఆధ్వర్యంలో గాయత్రి మాత కాలనీలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం కుంకుమ పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
గాయత్రి మాత గణేష్ మండలి కమిటీ అధ్యక్షులు శ్రీరంభట్ల విజయకుమార్, ప్రధాన కార్యదర్శి తాటికొండ మల్లేష్, కోశాధికారి అబ్బోజు సుదర్శన చారి ఆధ్వర్యంలో ఈ పూజ కార్యక్రమం జరిగింది.
వేద పండితులు శ్రీశ్రీశ్రీరంభట్ల సుహాస్ శర్మ మహిళలందరితో కుంకుమ పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. గాయత్రి మాత కాలనీకి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పసుపు, బొట్టు, కుంకుమను పంచుకున్నారు.
పూజ అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.












