రామగుండం, 2026-08-03
ప్రజల సమస్యలకు సత్వర, పారదర్శక, నిష్పక్షపాత పరిష్కారం అందించడమే పోలీసు శాఖ లక్ష్యమని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. సోమవారం పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అధికారులకు ఆదేశాలు
ప్రజల నుంచి అందిన ప్రతి ఫిర్యాదును వెంటనే నమోదు చేసి, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విచారించి చట్ట ప్రకారం తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. బాధితులకు న్యాయం చేయడం పోలీసు శాఖ యొక్క ప్రధాన బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.
పోలీసులను ఆశ్రయించాలని సూచన
ప్రజలు ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొన్నా భయపడకుండా పోలీసులను ఆశ్రయించాలని, ప్రతి ఫిర్యాదును చట్ట పరిధిలో ప్రాధాన్యతతో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు రామగుండం పోలీసు శాఖ కట్టుబడి ఉందని కమిషనర్ తెలిపారు.