రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆదేశాల మేరకు, పెద్దంపేట గ్రామంలో షీ టీమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా షీ టీమ్ సిబ్బంది మహిళలకు వివాహిత మహిళలు ఎదుర్కొనే సమస్యలపై అవగాహన కల్పించారు. సమాజంలో, కార్యాలయాల్లో మరియు సామాజిక మాధ్యమాల్లో మహిళలు ఎదుర్కొనే వేధింపులు ప్రధాన సమస్యగా ఉన్నాయని వారు పేర్కొన్నారు.
షీ టీమ్ సిబ్బంది, మహిళల భద్రత, రక్షణ, సమస్యల పరిష్కారం కోసం పోలీసు శాఖ, మహిళల రక్షణ చట్టాలు, షీ టీమ్స్ వంటి ప్రత్యేక విభాగాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
ప్రయాణాల సమయంలో వేధింపులకు గురైన మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. రామగుండం షీ టీమ్ వాట్సాప్ నంబర్ 6303923700 మరియు మంచిర్యాల షీ టీమ్ నంబర్ 8712659385 లేదా డయల్-100 కు సమాచారాన్ని అందించాలని కోరారు.








