మందమర్రి, 2026-06-05
మందమర్రి ఫోటో వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు కీ.శే. శ్రీ చింతకింది రవి కుటుంబానికి సంఘం అండగా నిలిచింది. ఇటీవల అనారోగ్యంతో మరణించిన రవి కుటుంబానికి రూ.58,000 ఆర్థిక సహాయాన్ని అసోసియేషన్ అందజేసింది.
మందమర్రి ఫోటో వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ శాశ్వత సభ్యుడు కీ.శే. శ్రీ చింతకింది రవి అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. వారి కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో అసోసియేషన్ సభ్యులందరి సహకారంతో రూ.58,000/- (యాభై ఎనిమిది వేల రూపాయలు మాత్రమే) ఆర్థిక సహాయాన్ని వారి 11వ రోజు పెద్దకర్మ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.
సభ్యులకు ధన్యవాదాలు
ఈ ఆర్థిక సహాయానికి సహకరించిన ప్రతి సభ్యునికి అసోసియేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు వడ్లకొండ కనకయ్య గౌడ్, మందమర్రి పట్టణ ప్రధాన కార్యదర్శి ఆడెపు అశోక్ కుమార్, జిల్లా కోశాధికారి ముక్కెర శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి శ్రీపతి రవి, మంచిర్యాల పట్టణ అధ్యక్షులు రాజబాబు, మందమర్రి కుటుంబ భరోసా ఇంచార్జ్ పట్టి సతీష్ బాబు, గౌరవ సలహాదారులు నక్క తిరుపతి, జాడి ముకుందం, ఉపాధ్యక్షులు లక్కిరెడ్డి అనిదర్ రెడ్డి, నక్క పవన్, ఆర్. సుజిత్, ప్రచార కార్యదర్శి కందుకూరి శ్రీకాంత్, కార్యనిర్వహణ కార్యదర్శులు జూపాక సది, విక్టరీ అశోక్ పాల్గొన్నారు.
సానుభూతి తెలిపినవారు
వీరితో పాటు హైమాక్స్ ప్రసాద్, కెమెరా గణేష్, బసం అంజి, కమెరా మహేందర్, కుడిపూడి రాము, దాసరి శ్రీకాంత్, గడ్డం మనోజ్, పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి దానపెల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొని బాధిత కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.











