మంచిర్యాల జిల్లా మందమర్రి లో ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో స్టూడియో యజమానుల సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో స్టూడియో పాస్ ఫోటోస్ రేట్ల పెంచే అంశంపై చర్చ జరిగింది. సభ్యులు కుటుంబ భరోసా మరియు వచ్చే నెల జరగబోయే ఫోటో భవనం మూడో వార్షికోత్సవం నిర్వహణపై కూడా చర్చించారు.
సమావేశంలో మంచిర్యాల జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు వడ్లకొండ కనకయ్య గౌడ్, మందమరి పట్టణ అధ్యక్షులు పసుల వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శి ఆడేపు అశోక్ కుమార్, కోశాధికారి బద్రి సతీష్, వర్కింగ్ ప్రెసిడెంట్ వలస మణిరజ్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు మచ్చ గిరి సత్యనారాయణ, నక్క తిరుపతి, ఉపాధ్యక్షులు లక్కిరెడ్డి అనిదర్ రెడ్డి, నక్క పవన్, R సుజిత్, కార్యదర్శి పసుల రవి, బన్నీ శివ, K రాము తదితరులు కూడా ఉన్నారు.
సమావేశంలో ఫోటో వీడియో గ్రాఫర్ ఐక్యత వర్ధిల్లాలి అన్న నినాదం వినిపించింది.











