మంచిర్యాల నగరంలోని 15వ డివిజన్ ఎస్సీ కాలనీలో నూతన డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం మరియు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చొరవతో ఎస్సీ&ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల ద్వారా ఈ పనులు మంజూరు అయ్యాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ ధర్ని మధు, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్ హాజరయ్యారు. వారు రిబ్బన్ కట్ చేసి, పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా, కాలనీ వాసుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
15వ డివిజన్ కార్పొరేటర్ చింతపండు శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కృషితోనే ఈ అభివృద్ధి పనులు సాధ్యమయ్యాయని తెలిపారు. కాలనీలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వేంపల్లి మాజీ సర్పంచ్ గోనె సంజీవ్ కుమార్, ఓలపు శారదా రమేష్, సింగరావ్ శామెల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. డ్రైనేజీ పనులతో పాటు, ఇతర అభివృద్ధి పనులు కూడా చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.











