మంచిర్యాల (ప్రజావార్త) ఆగస్టు 24
మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద సీఐటీయు ఆధ్వర్యంలో హమాలీ కార్మికులు ధర్నా నిర్వహించారు. తమ శ్రమను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోచుకుంటున్నాయని, ప్రభుత్వాలు మారుతున్నా తమ బతుకులు మారడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రధాన డిమాండ్లు
హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రమాద బీమాను రూ. 25 లక్షలకు పెంచాలని సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు.
ఆల్ హమాలి వర్కర్స్ యూనియన్ (సీఐటీయు) జిల్లా అధ్యక్షులు గోమాస ప్రకాష్ మాట్లాడుతూ, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించాలని కోరారు.