రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఈద్గా వద్ద ప్రత్యేక పారిశుధ్య, అభివృద్ధి పనులను మున్సిపాలిటీ చైర్పర్సన్ డాక్టర్ గోడిసెల సంధ్యారాణి పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆమె సూచించారు.
క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డ్ తారక రామ కాలనీ డబల్ బెడ్ రూమ్ ఈద్గా పరిసరాల్లో చేపడుతున్న పనులను చైర్పర్సన్ డాక్టర్ గోడిసెల సంధ్యారాణి గారు పరిశీలించారు. పండుగ సందర్భంగా ఈద్గా వద్దకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశముండటంతో, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆమె మున్సిపల్ అధికారులకు సూచించారు.
ఈద్గా పరిసర ప్రాంతాల్లో చెత్త తొలగింపు, తాగునీటి సౌకర్యం, వీధి దీపాల నిర్వహణ వంటి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ఆరోగ్యం మరియు పరిశుభ్రతకు మున్సిపాలిటీ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని, పండుగ రోజుల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆమె తెలిపారు.
దర్గా పరిసర ప్రాంతాలను పూర్తిగా పరిశుభ్రంగా ఉంచడంతోపాటు, పారిశుధ్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చైర్పర్సన్ పేర్కొన్నారు. పండుగ వాతావరణానికి అనుగుణంగా అన్ని శాఖల సమన్వయంతో మున్సిపాలిటీ తరఫున అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఆమె తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో 1వ వార్డ్ కౌన్సిలర్ కౌడగొని సంబయ్య, 6వ వార్డ్ కౌన్సిలర్ మద్దెల శంకర్, 14వ వార్డ్ కౌన్సిలర్ కొప్పి రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్, సానిటరీ ఇన్స్పెక్టర్ సునీల్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ సంతోష్, మైనారిటీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మరియు మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.












