మంచేరియల్, 2026-07-04
క్యాతనపల్లిమున్సిపాలిటీపరిధిలోవర్షాలకుకూలినఇంటితోఇబ్బందులుపడుతున్నవృద్ధురాలుఆర్కుమున్సిపల్చైర్పర్సన్డాక్టర్సంధ్యారాణి,ఆమెభర్తరాజారమేష్అండగానిలిచారు.కొత్తచెప్పారు.కట్టించిఇస్తామని,దానికిఅయ్యేఖర్చుఅంతాతామేభరిస్తామనిఇల్లుకట్టిస్తామని భరోసా ఇచ్చారు.ఈసంఘటనతోఆర్కుఅండగానిలిచిననాయకులనుప్రజలుఅభినందిస్తున్నారు.
చెన్నూర్ నియోజకవర్గం, క్యాతనపల్లి మున్సిపాలిటీ 17వ వార్డు శ్రీనివాస నగర్ లో నివాసం ఉంటున్న వితంతు, వృద్ధురాలు భూదమ్మ ఇంటి గోడ ఇటీవల కురిసిన వర్షాల వల్ల కుంగిపోయి కూలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్ పర్సన్ డాక్టర్ సంధ్యారాణి, ఆమె భర్త రాజా రమేష్, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు భూదమ్మ ఇంటికి వెళ్లి ఆమెను కలిసి ధైర్యం చెప్పారు. కొత్తగా ఇల్లు కట్టిస్తామని భరోసా ఇచ్చారు.
తనకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని, అయితే తమ వద్ద డబ్బులు లేవని భూదమ్మ విలపించగా, BRS పార్టీ నాయకులు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇల్లు కట్టించే బాధ్యత తామే తీసుకుంటామని తెలియజేశారు. సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరగా ఇల్లు పూర్తయ్యేలా చూస్తామని అన్నారు. అప్పటివరకు భూదమ్మను వారి పక్కనే ఉన్న ఒక ఇంట్లో ఉండేందుకు ఏర్పాట్లు చేశారు.
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఇల్లు లేక ఇబ్బంది పడుతున్న వారు మున్సిపాలిటీ కార్యాలయానికి వచ్చి వినతిపత్రం ఇస్తే తగిన చర్యలు తీసుకుంటామని, ప్రజలందరూ పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయం, న్యాయం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ కౌన్సిలర్ బబ్బెర స్వర్ణలత, మాజీ వార్డు కౌన్సిలర్ రామిడి ఉమ, నాయకులు రామిడి కుమార్, లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు.












