మంచేరియల్, 2026-09-10
సామాజిక అన్యాయాలు, దోపిడీ, అణచివేతను ఎదురించి చాకలి ఐలమ్మ సాగించిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం నస్పూర్ లో జరిగిన చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పేద, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఆమె చూపిన ధైర్యసాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు.
వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ : సామాజిక అన్యాయాలు, దోపిడీ, అణచివేతను ఎదురించి చాకలి ఐలమ్మ సాగించిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశం మందిరంలో వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములు, జిల్లా రెవెన్యూ అధికారి మోతీరామ్, వెనుకబడిన తరగతుల శాఖ అధికారి నీరటి రాజేశ్వరి,కుల సంఘాల ప్రతినిధులతో కలిసి హాజరై చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పేద, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం చాకలి ఐలమ్మ చూపిన ధైర్యసాహసాలు, పట్టుదల నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. వెట్టి చాకిరీ, దోపిడీ, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడి మహిళా చైతన్యానికి, సామాజిక న్యాయానికి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. చాకలి ఐలమ్మ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని సమానత్వం, సామాజిక న్యాయం, మహిళా సాధికారత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. అనంతరం కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణేశ విగ్రహాలను పంపిణీ చేసి మట్టి వినాయక విగ్రహాల వినియోగంపై గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణహితమైన మట్టి విగ్రహాలను వినియోగించడం ద్వారా జలవనరుల కాలుష్యాన్ని నివారించవచ్చని, ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. రసాయనిక రంగులు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాలకు బదులుగా మట్టి వినాయక విగ్రహాలను ఉపయోగించి పర్యావరణహితంగా వినాయక చవితి వేడుకలను నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.












