మంచిర్యాల పట్టణంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో, గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన గణేష్ శోభాయాత్ర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా విజయవంతంగా ముగిసినట్లు సమితి సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు హర్షం వ్యక్తం చేశారు.
విశ్వనాథాలయం ఆలయం హాల్లో జరిగిన ఈ సమావేశంలో, శోభాయాత్ర విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ హిందూ ఉత్సవ సమితి కమిటీ ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలిపింది.
ముఖ్యంగా, మంచిర్యాల పోలీస్ శాఖ, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్, అగ్నిమాపక సిబ్బంది, విద్యుత్ శాఖ సిబ్బంది, మత్స్య శాఖ సిబ్బంది, అలాగే ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకు సమితి కృతజ్ఞతలు తెలియజేసింది.
పట్టణంలో వివిధ ప్రాంతాల్లో గణేష్ మండపాలు ఏర్పాటు చేసి, చక్కగా నిర్వహించిన అన్ని గణేష్ ఉత్సవ కమిటీలకు కూడా సమితి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది.
గత తొమ్మిది రోజులుగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహకరించిన అందరికీ హిందూ ఉత్సవ సమితి ధన్యవాదాలు తెలిపింది. ఈ విజయవంతమైన ఉత్సవాల నిర్వహణలో అందరి సహకారం ఎంతో కీలకమని సమితి సభ్యులు పేర్కొన్నారు.










