మంచేరియల్, 1 October
శ్రీరాంపూర్ ఏరియాలోని -1 గనిలో గురువారం గుర్తింపు సంఘంలోకి 80 మంది యువ కార్మికులు భారీగా చేరారు.
కార్మికుల హక్కుల కోసం పోరాటం ఆగదని, ఒప్పందాలు అమలు చేయడంలో వెనక్కి తగ్గేది లేదని, యువ కార్మికుల భవిష్యత్తు కోసం ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని సంఘం నాయకులు తెలిపారు. యువ కార్మికుల ఉప్పెన నేపథ్యంలో ఎర్రదండులోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి.
శ్రీరాంపూర్ ఏరియాలోని -1 గనిలో గురువారం గుర్తింపు సంఘంలోకి 80 మంది యువ కార్మికులు భారీగా చేరారు. నవీన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన గేట్ మీటింగ్‌లో యువ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని యూనియన్‌లో చేరేందుకు ముందుకు వచ్చారు.
80 మంది కార్మికులకు కండువాలు కప్పి యూనియన్‌లోకి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కందుకుంట్ల వీరభద్రయ్య, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కే సమ్మయ్య, బ్రాంచ్ సెక్రెటరీ బాజీ సైదా ఆధ్వర్యంలో యూనియన్ నాయకులు చుక్కల వెంకటేష్ (అసిస్టెంట్ పిట్ సెక్రటరీ), వెంకటేష్, శ్రీకాంత్, నవీన్, శేఖర్, సురేశ్ బాబు, సురేష్ (జీఎం కమిటీ మెంబర్), సంజీవ్, యూసఫ్, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.












