మంచేరియల్, 21 September
నస్పూర్ లోని టీఎన్జీవో హౌసింగ్ కాలనీలో శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి వద్ద 7వ రోజు మహా అన్నదానం కార్యక్రమం జరిగింది. శ్రీమతి శ్రీలత సత్యనారాయణ, శ్రీమతి రాధా కృష్ణ గార్ల పుణ్య దంపతులు ఈ అన్నదానాన్ని నిర్వహించారు. అనంతరం, టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో దాతలను ఘనంగా సన్మానించారు.
టీఎన్జీవో హౌసింగ్ కాలనీ నస్పూర్ లోని శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి వద్ద 7వ రోజు మహా అన్నదానం కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ అన్నదానాన్ని శ్రీమతి శ్రీలత సత్యనారాయణ గార్ల పుణ్య దంపతులు మరియు శ్రీమతి రాధా కృష్ణ గార్ల పుణ్య దంపతులచే నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి మాట్లాడుతూ, శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి వద్ద మహా అన్నదానం చేసిన పుణ్య దంపతులకు శ్రీ సిద్ధి వినాయకుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. టీఎన్జీవో హౌసింగ్ కాలనీ శ్రీ సిద్ధి వినాయక మండలిలో నవరాత్రులను పురస్కరించుకొని ప్రతిరోజు మధ్యాహ్నం మహా అన్నదానం మరియు సాయంత్రం అల్పాహారం దాతల సహకారంతో విజయవంతంగా 7వ రోజు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తదుపరి, టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి గారి ఆధ్వర్యంలో మహా అన్నదానం చేసిన శ్రీమతి శ్రీలత సత్యనారాయణ గార్ల పుణ్య దంపతులకు మరియు శ్రీమతి రాధా కృష్ణ గార్ల పుణ్య దంపతులకు టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ తరపున ఘనంగా సన్మానం చేశారు. ఈ మహా అన్నదాన కార్యక్రమంలో టీఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీ ఉత్సవ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షులు గుండేటి యోగేశ్వర్, కార్యదర్శులు కస్తూరి నాగేశ్వర్, టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ కార్యదర్శి శ్రీ హబీబ్ హుస్సేన్, ఉపాధ్యక్షులు సైడ్ల మొండయ్య, టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ నాయకులు పుప్పాల హనుమంత రావు, పొన్న మల్లయ్య, శ్రీపతి బాపురావు, బొడ్డు శ్రావణ్ కుమార్, భూముల రామ్మోహన్, తిరుపతి రెడ్డి, సునీత, టి.తిరుపతి, జె.రాంకుమార్, ప్రసాద్, ఉషన్నతో పాటు టీఎన్జీవో కాలనీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.


