మంచేరియల్, 25:7:26
తొలి ఏకాదశి పర్వదినాన మంచిర్యాలలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ అసోసియేషన్ మహాసభ జరిగింది. ఈ సమావేశంలో మంచిర్యాల ఆర్వో పరిధిలోని నూతన కమిటీని ఎన్నుకొని ఆమోదించారు. రాష్ట్ర కార్యవర్గంతో పాటు పలువురు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మంచిర్యాలలోని కాలేజీ రోడ్డు బులియన్ మర్చంట్ అసోసియేషన్ లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ అసోసియేషన్ మహాసభ ఆదివారం తేదీ 25:7:26 న జరిగింది. ఈ సందర్భంగా మంచిర్యాల ఆర్వో కమిటీని ఎన్నుకొని ఆమోదించారు.
ఈ సమావేశానికి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ అసోసియేషన్ మెయిన్ కమిటీ చైర్మన్ శ్రీ రామదాసు రవి చారి, అధ్యక్షులు మేడోజు నవీన్ చారి, ప్రధాన కార్యదర్శి శ్రీ రామచంద్రోజు ప్రవీణ్ చారి, సహాయ కార్యదర్శి మారోజు యాదగిరి చారి, కోశాధికారి A. మాధవచారి, సహాయక కోశాధికారి మేడోజు బ్రాహ్మచారి గార్లు హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గంతో పాటు మంచిర్యాల ఆర్వో పరిధిలోని అప్రైజర్లు అందరూ పాల్గొని విజయవంతం చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తూ, నూతన ఆర్ ఓ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి విజయవంతం చేయడంలో TGBAA రాష్ట్ర సలహాసభ్యులు, కార్యనిర్వాణాధికారి కట్టా వెంకటాచారి, సభ్యులు కడర్ల రామ్ మూర్తి తమవంతు పాత్ర పోషించారు.












