మంచేరియల్, 2026-07-07
మంచిర్యాల ఆర్టీసీ డిపో కార్గో సెంటర్లో వినియోగదారులు తీసుకెళ్లని పాత సామగ్రి, విడిభాగాలను వేలం వేయనున్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 9, 10, 13 తేదీలలో ఈ వేలంపాటలు నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ కే నరేష్ కుమార్ తెలిపారు.
మంచిర్యాల ఆర్టీసీ డిపో కార్గో సెంటర్లో నిల్వ ఉన్న పాత సామగ్రి మరియు విడిభాగాల వేలం ఈ నెలలో నిర్వహించనున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ కే నరేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 9, 10, 13 తేదీలలో వేలంపాటలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.
ఈ వేలంలో స్టేషనరీ, స్పేర్ పార్ట్స్, సినిమా పోస్టర్లు, పుస్తకాలు తదితర వస్తువులు వినియోగదారులు తీసుకెళ్లని వాటిని వేలం వేస్తున్నట్లు తెలిపారు. కావున వేలంలో పాల్గొనే వినియోగదారులు వేలం నిర్వహించే రోజు ఉదయం 11 గంటలకు కార్గో కార్యాలయంలో సంప్రదించి వేలంపాటలలో పాల్గొనాలని డిపో మేనేజర్ కోరారు.








