క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో నూతనంగా రెటినా పెయింట్స్ షాప్ ను మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ గోడిసెల సంధ్యారాణి మరియు రాజా రమేష్ దంపతులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
గద్దరాగడిలో ఏర్పాటు చేసిన ఈ షాప్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. షాప్ యజమాని, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
చైర్పర్సన్ డాక్టర్ గోడిసెల సంధ్యారాణి, స్థానిక యువత వ్యాపార రంగంలో రాణించడం ప్రశంసనీయమని అన్నారు. నాణ్యమైన సేవలతో వినియోగదారుల మన్ననలు పొంది, వ్యాపారంలో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా పెయింట్ షాప్ యజమానులు చైర్పర్సన్ దంపతులను ఘనంగా సన్మానించి, తమ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామిడి కుమార్, చంద్ర మౌళి, సుధాకర్, సీపీఐ నాయకులు వనం సత్యనారాయణ, స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు ఇతర ప్రముఖులు హాజరయ్యారు.





