మంచేరియల్, 2026-06-29
జిల్లా వార్షిక రుణ లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేలా బ్యాంకర్లు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో వివిధ బ్యాంకుల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను 8,796 కోట్ల రూపాయల లక్ష్యాన్ని నిర్దేశించినట్లు తెలిపారు.
జిల్లా వార్షిక రుణ లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేలా బ్యాంకర్లు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎ.జి.ఎం. చేతన్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ జి.ఉపేందర్ గౌడ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ నటరాజ్ లతో కలిసి వివిధ బ్యాంకుల అధికారులతో రుణ లక్ష్యసాధనపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను 8,796 కోట్ల రూపాయల లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగిందని తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను మార్చి-2026 వరకు పంట రుణాలకు 2,541 కోట్ల రూపాయలు లక్ష్యం కాగా 1,521 కోట్ల రూపాయలు, వ్యవసాయ దీర్ఘకాలిక రుణాలకు గాను 922 కోట్ల రూపాయలకు గాను 673 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, వ్యవసాయ రంగానికి 4,322 కోట్ల రూపాయలు లక్ష్యం కాగా 2,673 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 1,105 కోట్ల రూపాయలు లక్ష్యం కాగా 610 కోట్ల రూపాయలు, విద్యా రుణాలు 138 కోట్ల రూపాయలు లక్ష్యం కాగా 8 కోట్ల 42 లక్షల రూపాయలు, గృహనిర్మాణ రుణాల లక్ష్యం 269 కోట్ల రూపాయలకు గాను 67 కోట్ల 53 లక్షల రూపాయలు, ప్రాధాన్యత రంగాల క్రింద 5,936 కోట్ల రూపాయలకు గాను 3,449 కోట్ల రూపాయలు, ప్రాధాన్యేతర రంగాల క్రింద 1,940 కోట్ల రూపాయలకు గాను 2,558 కోట్ల రూపాయలు సాధించడం జరిగిందని తెలిపారు.
ముద్ర రుణాల క్రింద 21,757 మందికి 248 కోట్ల రూపాయలు అందించడం జరిగిందని తెలిపారు. ప్రధానమంత్రి జన్ ధన్ పథకం క్రింద 3,12,359 మందికి ఖాతాలు తెరువడం జరిగిందని, ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా యోజన పథకం క్రింద 1,31,115 మందికి, ప్రధానమంత్రి సురక్షా భీమా యోజనలో 3,41,397 మందికి, అటల్ పెన్షన్ యోజన పథకం క్రింద 42,194 మంది నమోదు చేసుకున్నారని తెలిపారు.
గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థల ద్వారా యువతకు శిక్షణ అందించి ఆర్థిక చేయూతతో ప్రోత్సహించాలని తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డు క్రింద చేపల పెంపకం కొరకు 64 మంది లబ్ధిదారులకు, పాడి పశువులకు గాను 308 మంది లబ్ధిదారులకు లబ్ది చేకూర్చడం జరిగిందని తెలిపారు. స్వయం ప్రాధాన్యత రంగాలలో రుణాల కొరకు వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని తెలిపారు. సైబర్ నేరాలపై ప్రజలకు తెలిసే విధంగా అవగాహన కల్పించాలని తెలిపారు. చిరు వ్యాపారాలు, విద్య, గృహ రుణాలను వినియోగించుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపన, అభివృద్ధిపై ప్రత్యేక శిబిరాలు నిర్వహించి ప్రజలకు వివరించాలని తెలిపారు.












