మంచేరియల్, 2026-07-25
ఓదెల మండలం రూపునారాయణపేట గ్రామానికి చెందిన 15 ఏళ్ల చెలిక ఆదిత్య, శుక్రవారం మానేరు నదిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. ఈ విషాదకర సంఘటన నేపథ్యంలో ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే శ్రీ. చింతకుంట విజయరమణ రావు ఆసుపత్రికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఓదెల మండలం రూపునారాయణపేట గ్రామానికి చెందిన చెలిక ఆదిత్య (15) శుక్రవారం గ్రామ సమీపంలోని మానేరు నదిలో సరదాగా ఈతకు వెళ్ళాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న గౌరవ ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారు సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి హుటాహుటిన చేరుకున్నారు. ఆదిత్య పార్థివ దేహాన్ని చూసి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని, సంతాపన్ని తెలిపారు.












