మంచేరియల్, శుక్రవారం
లషెటటిపేటపటటణలోనిీనగచౌదదజిగినోడడపమదలోమగగిిీగలి.ీనగచౌమీపలోఎదగననటట,ఆటోనబలగఢీొటటిది.ఈఘటనలోఆటోడైోపటఇదదపణిలగపడడ.
లక్షెట్టిపేట పట్టణంలోని కరీంనగర్ చౌరస్తా రాష్ట్ర రహదారిపై ట్రాక్టర్ ఆటోను ఢీకొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పాత కొమ్ముగూడెం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మంద లచ్చయ్య, తన ఆటోలో సంయుక్త, సత్తయ్య అనే ఇద్దరు ప్రయాణికులను ఎక్కించుకొని లక్షెట్టిపేట వైపు వస్తుండగా, కరీంనగర్ చౌరస్తా సమీపంలో ఎదురుగా జన్నారం వైపు వెళ్తున్న ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ లచ్చయ్యతో పాటు ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు అయింది. గాయాలపాలైన డ్రైవర్ లచ్చయ్య సోదరుడు మంద శంకరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోపతి సురేష్ తెలిపారు.












