మంచేరియల్, 16-07-2026
రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో హోంగార్డు లక్ష్మణ్ (45) మృతి కేసులో పోలీసులు హిట్ అండ్ రన్ కేసును ఛేదించారు. ఈ నెల 11న విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా, నజీర్పల్లి పైవంతెన వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తలకు తీవ్ర గాయాలై, చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ఆయన మృతి చెందారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న లక్ష్మణ్ (45) మృతి కేసులో పోలీసులు హిట్ అండ్ రన్ కేసును ఛేదించారు. ఈ నెల 11వ తేదీన విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న లక్ష్మణ్‌ను నజీర్పల్లి పైవంతెన వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలైన ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందారు.
కేసు నమోదు చేసుకున్న జైపూర్ పోలీసులు, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు సీఐ నవీన్‌కుమార్, ఎస్ఐ భూమేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల దృశ్యాలు, సాంకేతిక ఆధారాలు, స్థానిక సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.
దర్యాప్తులో ప్రమాదానికి కారణమైన వాహనం ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన TS20 Z 0012 నంబర్ గల ఆర్టీసీ బస్సుగా గుర్తించారు. బస్సు డ్రైవర్ బెజ్జూర్‌కు చెందిన జంగిటి రాజేశ్‌గా గుర్తించారు. జంగిటి రాజేశ్ ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారని, ప్రమాద సమయంలో బస్సు ఆసిఫాబాద్ నుంచి గోదావరిఖని వైపు వెళ్తోందని విచారణలో వెల్లడైంది. విచారణలో తన తప్పిదాన్ని డ్రైవర్ ఒప్పుకున్నట్లు జైపూర్ ఎస్ఐ భూమేష్ ఒక ప్రకటనలో తెలిపారు.












